యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బస్టాండ్‌లో చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. మూడు గంటల్లోనే కేసును ఛేదించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు... పాపను కిడ్నాప్ చేసిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. పాపను ఆ తల్లికి అప్పగించారు. పరారీలో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
గద్వాల్ జిల్లాకు చెందిన తల్లీ కూతుర్లను కొందరు మాయమాటలు చెప్పి... భువనగిరికి తీసుకొచ్చారు. అయితే తల్లి మహేశ్వరీకి కూల్ డ్రింగ్‌లో మత్తు ఇచ్చి.. చిన్నారిని ఎత్తుకెళ్లారు. పాప కనిపించకపోవడంతో మహేశ్వరీ ఏడుస్తూ ఉండటాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు... కిడ్నాప్ ఉధాంతంపై దర్యాప్తు చేసి... ఇద్దరు నిందితులను పట్టుకున్నారు.