Vemulawada : వేములవాడ ఆలయంలో నాగుపాము .. భక్తులు పరుగులు
Vemulawada : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం గోపురం ముందు నాగుపాము ప్రత్యక్షమై భక్తులను ఉరుకులు పరుగులు పెట్టించింది.
Vemulawada : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం గోపురం ముందు నాగుపాము ప్రత్యక్షమై భక్తులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ప్రధాన దారిలోనే పాము ప్రత్యక్షం కావడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. అక్కడికిచేరుకున్న దేవస్థానం సిబ్బంది లక్ష్మణ్ నాగుపామును పట్టుకొని పట్టణ శివారులో వదిలివేయడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం కావడంతో సాక్షాత్తు శివుడి మహిమే అంటూ పలువురు భక్తులు దూరంనుంచి దండం పెట్టుకున్నారు. గతంలోకూడా ఆలయంలో నాగుపాము వచ్చి హల్ చల్ చేసింది.