Kishan Reddy : మెదక్ ప్రజల దశాబ్దాల కల నెరవేరింది : కిషన్ రెడ్డి

Kishan Reddy : మెదక్ ప్రజల దశాబ్దాల రైల్వే లైన్ కల నెరవేరిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Update: 2022-09-23 13:00 GMT

Kishan Reddy : మెదక్ ప్రజల దశాబ్దాల రైల్వే లైన్ కల నెరవేరిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పటి నుంచి ఎంపీలుగా అలె నరేంద్ర, విజయశాంతి, కొత్తా ప్రభాకర్‌రెడ్డిలు కృషి చేస్తే.. ప్రధాని మోదీ నెరవేర్చారని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణలో రైల్వేలైన్ల అభివృద్ధి జరగలేదన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని రైల్వే లైన్లను సాధించుకోవాలన్నారు. మెదక్ రైల్వేస్టేషన్‌లో గూడ్స్ రైలు కోసం ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేస్తామని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు.

అంతకుముందు.. మెదక్ రైల్వేస్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొత్త రైలును కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించిన సందర్భంగా.. గులాబీ, కమలం మధ్య వార్‌తో రచ్చ రచ్చ అయింది. ప్రారంభోత్సవ సభకు భారీగా

తరలివచ్చిన టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు. మెదక్‌కు రైలును తెచ్చిన క్రెడిట్ తమదేనంటూ రెండు పార్టీల నాయకులు చేసిన నినాదాలతో రైల్వే ప్రాంగణం హోరెత్తింది. ఉద్రిక్తతల మధ్యే స్థానిక ఎంపీ కొత్తా ప్రభాకర్‌రెడ్డితో కలిసి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. మెదక్ నుంచి కూచిగూడ వెళ్లే రైలును ప్రారంభించారు. 

Tags:    

Similar News