Kishan Reddy: తెలంగాణలో ధాన్యం నిల్వలపై కిషన్ రెడ్డి సంచలన ప్రకటన..
Kishan Reddy: తెలంగాణలో ధాన్యం నిల్వలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు.;
Kishan Reddy: తెలంగాణలో ధాన్యం నిల్వలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలోని రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించాలని ఎఫ్‌సీఐకి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని మిల్లర్ల దగ్గర ఉండాల్సిన బియ్యం నిల్వలు లేవని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 40 రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించిన ఎఫ్‌సీఐ అధికారులు.. 4 లక్షల 53 వేలకు పైగా బియ్యం సంచులు తక్కువగా ఉన్నట్లు తేల్చారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఎఫ్‌సీఐ తనిఖీల్లో వెల్లడైన వివరాలను టీఆర్‌ఎస్ సర్కార్‌కు అధికారులు తెలియజేసినట్లు స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యతగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలన్నారు కిషన్‌రెడ్డి.