Kishan Reddy : ఢిల్లీకి వెళ్లి కేసీఆర్ ఏం చేశారో ప్రజలకు చెప్పాలి : కిషన్ రెడ్డి
Kishan Reddy : వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం కేసీఆర్ ఢిల్లీలో కూర్చోవడమేంటని ప్రశ్నించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.;
Kishan Reddy : వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం కేసీఆర్ ఢిల్లీలో కూర్చోవడమేంటని ప్రశ్నించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ నాలుగు రోజులు ఢిల్లీలో ఉండి ఏం చేశారో ప్రజలకు తెలియాలన్నారు. మూసారంబాగ్ వద్ద మూసీ వరదను పరిశీలించిన కిషన్ రెడ్డి.. మూసీ నది ఆక్రమణలను ప్రభుత్వ పెద్దలే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
మూసీ ఒడ్డున అక్రమంగా షెడ్డులు వేసి పేదలకు అద్దెకు ఇస్తున్న వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన చేస్తానన్న సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. వరదలతో నష్టపోయిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు కిషన్ రెడ్డి. SDRF నిధులపై మంత్రి కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని, పుత్రవాత్సల్యంతో కేసీఆర్ కేంద్రంపై విమర్శలు చేయడం తగదని అన్నారు.