KOMATIREDDY: కొనసాగుతున్న కోమటిరెడ్డి కలకలం
మరోసారి రేవంత్‌పై కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు.. ప్రతిపక్షాలను తిట్టడం ఆపాలన్న రాజగోపాల్ రెడ్డి;
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా విషయంలో ఓడ దాటే వరకు ఓడ మల్లన్న.. ఓడ దాటిన తర్వాత బోడ మల్లన్న అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ తన భాష మార్చుకోవాలని సూచించారు. మరో మూడున్నరేళ్లు రేవంత్ రెడ్డే సీఎం అని, ఆ తర్వాత ఎవరు అనేది అప్పుడు చూద్దామన్నారు. తనకు మంత్రి పదవి విషయంలో హైకమాండ్ ప్రామిస్ చేసిందని మరోసారి రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు ‘సీఎం రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలి. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు చెప్పాలి. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటుంన్నారు. నాకు మంత్రి పదవి విషయంలో హైకమాండ్ ప్రామిస్ చేసింది. నా మంత్రి పదవి విషయం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తెలియదు. ఇంకా మూడున్నరేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఎవరు అనేది అప్పుడు చూద్దాం. అందరం కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది’ అని చెప్పారు. ‘సోషల్ మీడియా విషయంలో ఓడ దాటే వరకు ఓడ మల్లన్న.. ఓడ దాటిన తర్వాత బోడ మల్లన్న అన్నట్లు ఉంది సీఎం రేవంత్ రెడ్డి వైఖరి అని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. నాకు మంత్రి పదవే కావాలంటే అప్పుడే కేసీఆర్ ఇచ్చేవారన్నారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ ఉందని... అసెంబ్లీకి రాని కేసీఆర్.. ముందుగా తన ప్రతిపక్ష హోదా పదవికి రాజీనామా చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.
రేవంత్ వెనుక ఏపీ పెట్టుబడిదారులు
సీఎం వెనుక 20 మంది ఆంధ్రా పెట్టుబడిదారులు ఉన్నారని, వారంతా తెలంగాణ సంపదను దోచుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే వారి బండారం బయటపెడతానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. రేవంత్ రెడ్డి మాటతీరు, పనితీరుపై రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడుతూ, "ఇంకో మూడున్నర ఏళ్లు ఆయనే సీఎం. ఆ తర్వాత ఎవరు అనేది అధిష్టానం మరియు ప్రజలు నిర్ణయిస్తారు" అని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేశాయి.
డీకేతో భేటీ
మంత్రి పదవి రాలేదన్న ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. డీకేతో సమావేశం కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు, వరుస భేటీలు హాట్ టాఫిక్‌గా మారాయి.