హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌కు డిపాజిట్ కూడా దక్కదు : కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ కు డిపాజిట్ కూడా దక్కదని టీఆర్‌ఎస్ నేత కౌశిక్ రెడ్డి జోస్యం చెప్పారు.;
హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ కు డిపాజిట్ కూడా దక్కదని టీఆర్‌ఎస్ నేత కౌశిక్ రెడ్డి జోస్యం చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల చేసిన అభివృద్ధి ఏమీ లేదని, కనీసం సొంత ఊరి అభివృద్దిని కూడా పట్టించుకోలేదని విమర్శించారు. గెల్లు శ్రీనివాస్‌తోనే అభివృద్ధి సాధ్యమని హుజూరాబాద్ ప్రజలు భావిస్తున్నారని, ఎన్నికలు ఎపుడు జరిగినా భారీ మెజారిటీ గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.