TG : గచ్చిబౌలి పీఎస్ లో విచారణకు హాజరైన క్రిశాంక్, దిలీప్

Update: 2025-04-09 13:15 GMT

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో ఏఐ వాడి ఫేక్ ఫోటోస్ ను సోషల్ మీడియాలో వైరల్‌ చేయడంపై విచారణ చేపట్టారు పోలీసులు. విచారణలో భాగంగా బీఆర్ఎస్ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్ కుమార్ లు గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో హాజరయ్యారు. మన్నె క్రిశాంక్, దిలీప్ తో కలిసి పోలీసుల ఎదుట హాజరయ్యారు. డాక్టర్ మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్ కుమార్ ల విచారణ కొనసాగుతోంది. కోర్టు కూడా విచారణకు హాజరు కావాల్సిందేనని సూచించడంతో వీరిద్దరు పోలీస్ విచారణకు అటెండయ్యారు.

Tags:    

Similar News