కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పటివర కూ 45 మంది పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరో పించారు. గురుకుల విద్యార్థుల మరణాల న్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని అన్నారు. పిల్లలు ఎవరైనా అనారోగ్యంపాలైతే బీఆ ర్ఎస్ ను సంప్రదించాలని సూచించారు. అవసరమైతే తాము ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి కాపాడుకునే ప్రయత్నం చేస్తా మని చెప్పారు. కష్టాలు, ఇబ్బందులు వస్తే ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. గురుకుల విద్యార్థుల హత్యలపై అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం' అని హెచ్చరించారు. అసహనం,నిరాశ, నిస్పృహలో ఉన్నారు. సీఎం అయ్యాక కూడా మా మీద ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ’అని ప్రశ్నించారు.