KTR Accuses : తెలంగాణ మహిళలను రాహుల్ మోసం చేశారు.. కేటీఆర్ ఆరోపణ

Update: 2024-11-18 10:30 GMT

తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ మోసం చేశారంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 100 రోజుల్లో మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు. 350 రోజులు అయ్యినా ఇప్పటికీ రాహుల్ ఇచ్చిన ఆ హామీ అమలు కాలేదని గుర్తు చేశారు. తెలంగాణలోని కోటి 67 లక్షల మంది మహిళలు ఈ హామీ అమలు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. మీరు మీ పార్టీ తెలంగాణ మహిళలను మాటలతో మభ్యపెడుతున్నారంటూ కేటీఆర్ విమర్శలు చేశారు.

Tags:    

Similar News