KTR : ఆ విగ్రహం తొలగిస్తాం.. ఎయిర్‌పోర్టు పేరు మార్చుతాం.. కేటీఆర్ కీలక ప్రకటన

Update: 2024-08-19 08:30 GMT

సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. తాము అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలిగించి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

గతంలో తాము అధికారంలో ఉన్నపుడు సచి వాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించిన స్థలంలో పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

గతంలో తాము అధికారంలో ఉన్నా రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేరు మార్చలేదని.. కానీ వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చి రాజీవ్ గాంధీ పేరు తొలగించి పీవీ నరసింహారావు లేదా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ పేరు పెడతామని కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.

Tags:    

Similar News