KTR Challenges : లై డిటెక్టర్ టెస్ట్ చేసుకోండి.. కేటీఆర్ సవాల్

Update: 2025-01-17 10:15 GMT

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మనీ ల్యాండరింగ్ వ్యవహారంపై కేటీఆర్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారించింది. ఇంటరాగేషన్ తర్వాత మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి కేటీఆర్. లై డిటెక్టర్‌ పరీక్షకు తాను సిద్ధమన్నారు కేటీఆర్. అందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు. కోర్టులు, జడ్జిలపై నమ్మకం ఉందని, న్యాయమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. తప్పు చేయలేదు.. చేయబోను... తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. దాదాపు 7 గంటల పాటు ఈడీ విచారణ అనంతరం బయటకు వచ్చిన కేటీఆర్‌ సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డారు.

Tags:    

Similar News