KTR : ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాము : కేటీఆర్
KTR : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్;
KTR : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాము అంటూ విమర్శించారు. ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద అమిత్ షా బూట్లను.. బండి సంజయ్ పట్టుకున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మంత్రి కేటీఆర్ సెటైర్లు పేల్చారు. ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను.. ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని.. తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నదని చురకలు అంటించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలపడానికి.. తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉందని ట్వీట్ చేశారు.