KTR: అలా అయితే నేను రాజీనామా చేస్తా.. అమిత్‌షా ముక్కు నేలకు రాస్తాడా?: కేటీఆర్
KTR: తెలంగాణకు ఇచ్చే నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందని మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.;
KTR: తెలంగాణకు ఇచ్చే నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందని మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఒకవేళ రెండు లక్షల కోట్లు రాష్ట్రానికి ఇచ్చింది నిజమైతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేకుంటే అమిత్‌షా నేలకు ముక్కు రాస్తాడా? అని సవాల్ విసిరారు. నారాయణపేట జిల్లా పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్.. కొసిగిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజీలపై కేటీఆర్ ఫైరయ్యారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు జాతీయ హోదా ఇస్తామని మోసగించి నిసిగ్గుగా పాదయాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మసీదులు తవ్వాలని బండి సంజయ్ అంటున్నారని, సాగునీటి కాలువలు, ఇళ్లకోసం పునాదులు తవ్వి అభివృద్ధిలో ముందుండాలని హితవు పలికారు.