KTR: కేసులు పెడుతా అని కేంద్రమంత్రి బెదిరిస్తున్నారు- కేటీఆర్
KTR: కేంద్రంపై మరోసారి నిప్పులు చెరిగారు కేటీఆర్. అప్పుడు రైతులు, ఇప్పుడు యువకులు.. ఏ వర్గాన్ని మోదీ వదలట్లేదన్నారు.;
KTR: కేంద్రంపై మరోసారి నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. అప్పుడు రైతులు, ఇప్పుడు యువకులు.. ఏ వర్గాన్ని మోదీ వదలట్లేదన్నారు. గుజరాత్‌లో వరదలొస్తే వెయ్యి కోట్లిచ్చిన మోదీ.. హైదరాబాద్‌కు వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేదంటూ ఫైర్ అయ్యారు. దమ్ముంటే కంటోన్మెంట్‌లో ఫ్లై ఓవర్లు కట్టించంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు కేటీఆర్.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి కైతలాపూర్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించారు కేటీఆర్. 86 కోట్ల రూపాయలతో GHMC దీన్ని నిర్మించింది. ఈ ఆర్వోబి అందుబాటులోకి రావడంతో హైటెక్ సిటీ నుంచి కూకట్‌పల్లి, జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వెళ్లే వారి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. సనత్‌నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు 4 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గనుంది.