KTR: గుజరాత్ ప్రభుత్వం తీరుపై కేటీఆర్ మండిపాటు..
KTR: గుజరాత్‌లో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ 11 మంది దోషులను విడుదల చేయడంపై కేటీఆర్ మండిపడ్డారు.;
KTR: గుజరాత్‌లో గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ 11 మంది దోషులను విడుదల చేయడంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంతో వ్యవస్థ మీద నమ్మకం పోయిందన్నారు. మహిళలను గౌరవించాలని ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ చెప్పిన మాటల్లో నిజాయితీ ఉంటే గుజరాత్ ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని దోషులను మళ్లీ జైలుకు పంపాలన్నారు. రెపిస్టులందరికీ జీవితఖైదు లేదా ఉరిశిక్ష విధించాలన్నారు. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, జువెనైల్ జస్టిస్ చట్టానికి సవరణలు చేసి, రెపిస్టులకు బెయిల్ దొరకకుండా చేయాలన్నారు మంత్రి కేటీఆర్.