KTR : కేంద్రం పవన్ హాన్స్ విక్రయంపై కేటీఆర్ పలు ప్రశ్నలు
KTR : భారత ప్రభుత్వ రంగ సంస్థ ఏరోస్పేస్ రంగంలో రెండవ అతిపెద్దదైన పవన్ హాన్స్ లిమిటెడ్‌ను ప్రైవేటు పరం చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు.;
KTR : భారత ప్రభుత్వ రంగ సంస్థ ఏరోస్పేస్ రంగంలో రెండవ అతిపెద్దదైన పవన్ హాన్స్ లిమిటెడ్‌ను ప్రైవేటు పరం చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. లాభాల బాటలో ఉన్న పవన్ హాన్స్‌ను ప్రైవేటు కంపెనీకి విక్రయించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
2017లో 3వేల 7వందల కోట్ల నికర విలువ కలిగిన వనన్ హన్స్‌లోని కేంద్రప్రభుత్వం వాటాను కేవలం 211 కోట్లకే విక్రయించిన తీరును కేటీఆర్ ప్రశ్నించారు. పవన్ హాన్స్ ను కొనుగోలు చేసిన కంపెనీ ఆరు నెలల క్రితం కేవలం లక్ష కేపిటల్‌తో ప్రారంభమైందన్నారు.
ఈ డీల్‌పై అనుమానాలు వ్యక్తంమవుతున్నాయని... దీనికి కేంద్రమే సమాధానం చెప్పాలన్నారు. దాదాపు రూ.5 వేల కోట్లు విలువ కల్గిన పవన్ హాన్స్ సంస్థను 211 కోట్లకు ప్రైవేటుపరం చేసింది కేంద్ర ప్రభుత్వం.