పోలవరం- నల్లమల.. తెలంగాణ నెక్స్ట్ స్టెప్ ఏంటి..?

Update: 2026-01-13 06:45 GMT

ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టు మీద నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారించడానికి అర్హత లేనిది అని.. ఈ పిటిషన్ తో కర్ణాటక, మహారాష్ట్ర కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయని.. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. కాబట్టి ఈ పిటిషన్ తో కాకుండా వేరే పిటిషన్ ద్వారా న్యాయపోరాటం చేయొచ్చు అని తెలంగాణకు తెలిపింది సుప్రీంకోర్టు. దీంతో తెలంగాణ ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ ప్రభుత్వం మాత్రం తాము గోదావరి నది మీద తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులు కట్టినా అడ్డు చెప్పలేదని స్పష్టం చేస్తారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గోదావరిలో పుష్కలంగా నీరు ఉన్నాయని.. అందుకే తెలంగాణ ప్రాజెక్టులకు తాను ఎన్నడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని స్పష్టం చేశారు. వృధాగా బంగాళాఖాతంలో కలుస్తున్న గోదావరి వరద నీటిని మాత్రమే తాము వాడుకుంటున్నామని.. దానికి తెలంగాణ సహకరించాలని కోరారు.

రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పరంగా ముందుకు వెళ్లాలని.. అన్ని విషయాల్లో కలిసి ఉండాలని చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. పోలవరం నల్లమల ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అడ్డు చెప్పొద్దని కోరారు. ఎగువన ఉన్న రాష్ట్రం ఏదైనా ప్రాజెక్టు కడితే దిగువన ఉన్న రాష్ట్రానికి నష్టం జరుగుతుంది తప్ప.. దిగువన ఉన్న ఏపీ ఏ ప్రాజెక్టు కట్టినా సరే తెలంగాణకు అన్యాయం జరగదని చెప్పారు. పైగా ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఏపీ అవసరాలకు సరిపడా నీరు వాడుకున్న తర్వాత మిగిలిన నీటిని తెలంగాణ కూడా వాడుకోవచ్చని.. అప్పుడు రెండు రాష్ట్రాలకు లాభం జరుగుతుందని తెలిపారు. కానీ తెలంగాణ మాత్రం ఈ ప్రాజెక్టు విషయంలో వెనక్కు రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సుప్రీంకోర్టులోను ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఈ ప్రాజెక్టు నిర్మిస్తోందని వాదించింది.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం వాళ్లకు కేటాయించిన నీటి వాటాల కంటే ఎక్కువ వాడుకోవడానికి ప్రయత్నిస్తుందని.. దాన్ని కచ్చితంగా అడ్డుకుంటామన్నారు. మరో రూపంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. ఉత్తమ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పోరాటం చేసినా చివరకు తమకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రెండు రాష్ట్రాలు కలిసి నీటి విషయంలో సహకరించుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ మరో పిటిషన్ వేస్తుందా.. లేదంటే సీఎం చంద్రబాబు నాయుడు, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు నీటి విషయంలో సహకరించుకుంటారా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News