KTR: ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధం: కేటీఆర్
సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఎన్నికలు ఏవైనా తమ పార్టీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుందని చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ ఎన్నికైనా తమకు అనుకూలమే అని చెప్పారు. ‘‘కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయారని అనుకుంటోంది. వారి గ్యారంటీ కార్డులను గుర్తుచేసేందుకు.. మేము ‘బాకీ కార్డులను’ తీసుకువచ్చాం. వీటిద్వారా ఆ పార్టీ బాకీలను ఇంటింటికీ చేర్చడానికి ఉద్యమించాం. ‘బాకీ కార్డులు’ ఇంటింటికి తీసుకుపోతే, అదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం. కేసీఆర్‌ను తిరిగి తెచ్చుకోవాలనే ఆలోచన ప్రజల్లో కనిపిస్తోంది. ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఉద్ధరించే పరిస్థితి లేదు.. కానీ కొత్త నగరాన్ని కడతామని పోజులు కొడుతున్నారు. మున్సిపల్ శాఖ విషయంలో సీఎం రేవంత్ పూర్తిగా విఫలమయ్యారు’’ అని కేటీఆర్ విమర్శించారు.
ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకం లేదు: జగదీష్
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై బీఆర్ఎస్ పెదవి విరిచింది. ఈ ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకం తమకు లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు, 42 శాతం రిజర్వేషన్లు అసాధ్యమని తెలిసీ ప్రభుత్వం తప్పుచేస్తోందని మండిపడ్డారు. రిజర్వేషన్లపై ప్రభుత్వం మాట మారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారికంగా స్పందిస్తామని జగదీశ్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం తమదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్థాక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్లను ఆదేశించారు. అందరితో మమేకం కావాలని, గెలుపు గుర్రాలకు పోటీకి అవకాశం కల్పించాలని కేటీఆర్ సూచించారు.కాంగ్రెస్ హామీలను అమలు చేయలేదని విమర్శించారు. మరోవైపు ఎన్నికలు ఏవైనా తమ పార్టీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ ఎన్నికైనా తమకు అనుకూలమే అని చెప్పారు.
"బీసీలకు ఏం చేయాలో బీజేపీ నేతలు చెప్పాలి"
బీసీ రిజరేషన్లపై కాంగ్రెస్‌పార్టీ కావాలనే తాత్సారం చేస్తోందని, కులగణన, రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కాకి లెక్కలు కోర్టుల ముందు తేలుతాయంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్య 42 శాతం బీసీ రిజరేషన్లపై కాంగ్రెస్‌పార్టీ కావాలనే తాత్సారం చేస్తోందని, కులగణన, రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కాకి లెక్కలు కోర్టుల ముందు తేలుతాయంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రిజర్వేషన్ల అమలు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని అన్నారు. కానీ బీసీలను బీజేపీ నేతలు తప్పుదోవ పట్టిస్తూ.. మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు బీజేపీ మద్దుతు ఇచ్చి.. ఢిల్లీలో మళ్లీ అదే బిల్లును కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అసలు బీసీలకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో బీజేపీ నేతలు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడిందని అన్నారు.