KTR : బహ్రెయిన్‌లో నర్సయ్యను కాపాడండి.. కేటీఆర్ రిక్వెస్ట్

Update: 2024-08-12 07:15 GMT

బహ్రెయిన్లో పాస్ పోర్టు పోగొట్టుకుని నరక యాతన అనుభవిస్తున్న సిరిసిల్ల నివాసి నర్సయ్య సమస్యను పరిష్క రించాలని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. నర్సయ్య పాస్ పోర్ట్ పోవడంతో జైల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

నర్స య్యను భారత్ కు రప్పించేందుకు పార్టీ పరంగా కృషిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన 62 ఏండ్ల మనువాడ నర్సయ్యకు అండగా ఉంటామని కేటీఆర్ తెలిపారు.

నర్సయ్యను వెంటనే దేశానికి రప్పించేలా చూడాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ కు కేటీఆర్ ఈ మేరకు లెటర్ రాశారు.

Tags:    

Similar News