అచ్చే దిన్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం(NDA) ఒక్కరోజులోనే హ్యాట్రిక్ కొట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. LPG గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంపు, చమురు ధరలు కనిష్ఠానికి పడిపోయినా ఇంధనంపై రూ.2 ఎక్సైజ్ డ్యూటీ వడ్డింపు, సెన్సెక్స్ రూ.19 లక్షల కోట్లు ఆవిరి అయ్యాయని దుయ్యబట్టారు. అచ్చే దిన్‌కు ఇవి సంకేతాలా లేక భారత్‌ను గొప్పగా మార్చేందుకు ప్రారంభమా అని ప్రశ్నించారు.
త్వరలో భారీ భూకుంభకోణాన్ని బయటపెడతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 400 ఎకరాలు కాదు.. దాని వెనుక రూ.వేల కోట్ల వ్యవహారం ఉందన్నారు. ఈ కుంభకోణంలో బీజేపీ ఎంపీ ఉన్నారన్నారు. ఒకరు ఢిల్లీ నేత చెప్పులు మోస్తే.. మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారని విమర్శించారు. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలోనే ఉందని ఆరోపించారు.