శ్రావణి పాటకి కేటీఆర్ ఫిదా.. దేవీశ్రీ, తమన్‌కి ట్యాగ్ చేస్తూ..
మట్టిలో మాణిక్యాలు.. వెలుగులోని రాని కళాకారులు ఎందరో.. ఎవరో ఒకరి చేయూత వారి జీవితాన్ని మార్చేస్తుంది.;
మట్టిలో మాణిక్యాలు.. వెలుగులోని రాని కళాకారులు ఎందరో.. ఎవరో ఒకరి చేయూత వారి జీవితాన్ని మార్చేస్తుంది. ఆమె గళంలో అమృతం కురుస్తోంది. కేటీఆర్ సారూ మీరూ వినండి ఒకసారి అంటూ మెదక్ జిల్లా నారైంగి గ్రామానికి చెందిన శ్రావణి అనే అమ్మాయి గురించి సరేంద్ర తిప్రపరాజు అనే వ్యక్తి ట్వీట్ చేశారు. శ్రావణి ఓ ఆణిముత్యం. ఆమె అద్భుతంగా పాడుతోంది. ఆమె టాలెంట్‌కి మీ సహకారంతో పాటు మీ ఆశీస్సులు అవసరం అంటూ శ్రావణి పాడిన 'రేలా రే రేలా రే' పాటను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్.. శ్రావణి బాగా పాడుతోందని మెచ్చుకోవడంతో పాటు.. మ్యూజిక్ డైరెక్టర్లు దేవీశ్రీ ప్రసాద్‌కి, తమన్‌కి ట్యాగ్ చేశారు శ్రావణి పాట పాడిన వీడియోని ట్యాగ్ చేశారు. దీనిపై తమన్ స్పందిస్తూ.. శ్రావణి అద్భుతమైన సింగర్ అని అన్నారు. దేవీశ్రీ.. శ్రావణి స్వరానికి ఫిదా అయ్యానన్నారు. ఇంతటి ప్రతిభావంతురాలిని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో తాము నిర్వహించే షోలలో శ్రావణికి అవకాశం ఇస్తామని తెలిపారు.
Talented indeed 👏 @MusicThaman @ThisIsDSP https://t.co/auxEA2j0IS
— KTR (@KTRTRS) June 24, 2021