మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల దేశం మొత్తం విషాదంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ వియత్నం పర్యటన చేయడం ఆశ్చర్యకరంగా ఉందని ఎక్స్ లో స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ కోసం, దేశం కోసం జీవితాంతం సర్వస్వం ధారపోసిన నాయకులను అవమానపరచడం కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ లోనే ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మహనీయులను అవమానపరచడం అని ఎద్దేవా చేశారు. పీవీ నరసింహారావు గారికి కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పారు. స్మతిలో పీవీకి జరిగిన అవమానం తెలంగాణ ఇచ్చిన మన్మోహన్ కు జరగకుండా చూడాలని ఇప్పటికే అసెంబ్లీలో కోరారు కేటీఆర్.