KTR Tweet: నిరుద్యోగ సంక్షోభానికి సూచిక.. స్టేషన్ లో నిరసనకారుల ఆందోళన: కేటీఆర్ ట్వీట్

KTR Tweet: అప్పుడు అన్నదాతల జీవితాలతో ఆడుకున్నారు.. ఇప్పుడు జవాన్ల జీవితాలతో ఆడుకుంటున్నారు.

Update: 2022-06-17 07:48 GMT

KTR Tweet: కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిని వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో యువత నిరసన వ్యక్తం చేస్తోంది. దాంతో పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న ఆందోళనలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్రం చర్యలపై మండిపడ్డారు. ఈ నిరసన జ్వాలలో దేశంలో నిరుద్యోగ సమస్యను ప్రతిబింబిస్తున్నాయని ట్వీట్ లో పేర్కొన్నారు.

అగ్నివీర్ పథకంపై జరుగుతోన్న ఈ హింసాత్మక ఆందోళనలు.. దేశంలో నిరోద్యోగ సంక్షోభ తీవ్రతను తెలిపే కచ్చితమైన సూచికలు.. అప్పుడు అన్నదాతల జీవితాలతో ఆడుకున్నారు.. ఇప్పుడు జవాన్ల జీవితాలతో ఆడుకుంటున్నారు.. మొన్నటికి మొన్న ఒకే ర్యాంక్ - ఒకే పింఛను విధానం తీసుకు వచ్చారు.. నేడు ర్యాంకు లేదు-పింఛను లేదు అని కేటీఆర్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

ఆందోళనకారుల విధ్వంసంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో 5గంటలైనా చల్లారని ఉద్రిక్తత. అగ్నిపథ్ ను నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టాలని నిర్ణయం.. పట్టాలపై ధర్నాతో మొదలుపెట్టి క్షణాల్లో రైళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు. 

Tags:    

Similar News