బీజేపీ 'దరఖాస్తుల ఉద్యమం'పై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
KTR: తెలంగాణ బీజేపీని, ఆ పార్టీ మొదలుపెట్టిన దరఖాస్తుల ఉద్యమాన్ని టార్గెట్ చేస్తూ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్‌తో చురకలు అంటించారు.;
KTR: తెలంగాణ బీజేపీని, ఆ పార్టీ మొదలుపెట్టిన దరఖాస్తుల ఉద్యమాన్ని టార్గెట్ చేస్తూ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్‌తో చురకలు అంటించారు. ప్రధాని మోదీ గతంలో హామీ ఇచ్చినట్టు ఒక్కో పౌరుడి అకౌంట్‌లో 15 లక్షలు వేసేందుకు.. బీజేపీ అప్లికేషన్లు ఆహ్వానించడాన్ని స్వాగతిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. తెలంగాణలో అర్హులంతా బీజేపీ నేతలకు దరఖాస్తులు పంపి.. జన్‌థన్ అకౌంట్ల ద్వారా ధనాధన్ లబ్ది పొందాలంటూ సూచించారు. దీనికి బండి సంజయ్ ట్వీట్‌ను ట్యాగ్ చేశారు. కరీంనగర్‌లో 'దరఖాస్తుల ఉద్యమం' ప్రారంభించామంటూ సంజయ్ చేసిన ట్వీట్‌ను టార్గెట్ చేస్తూ కేసీఆర్ ఇలా తనదైన స్టైల్లో పంచ్‌లు విసిరారు. పథకాల కోసం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. ప్రభుత్వానికి పంపేందుకు బీజేపీ కరీంనగర్ శాఖ 'దరఖాస్తుల ఉద్యమం' చేపట్టింది అంటూ సంజయ్ చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ.. గతంలో ఇస్తామని చెప్పిన 15 లక్షల మాటేంటని ఎత్తిపొడిచారు.