యువతి ప్రాణాలు కాపాడిన మహిళా పోలీస్
హైదరాబాద్ బేగంపేట్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికురాలికి ప్రమాదం తప్పింది. రైలు నుంచి జారి కింద పడిపోతున్న యువతిని;
హైదరాబాద్ బేగంపేట్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికురాలికి ప్రమాదం తప్పింది. రైలు నుంచి జారి కింద పడిపోతున్న యువతిని.. ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కాపాడింది. కదులుతున్న ఎంఎంటీఎస్ రైలును ఎక్కే ప్రయత్నంలో యువతి జారిపడింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ సునీత.. కిందపడిపోతున్న యువతిని చాకచాక్యంగా పక్కకు లాగేసింది. దీంతో యువతికి ప్రాణాపాయం తప్పినట్లయింది. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.