ఈటెల కుమారుడు పై భూకబ్జా ఆరోపణలు .. విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశం.. !

మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరింత ట్రబుల్ లో పడ్డారు.తాజాగా ఆయన కుమారుడు నితిన్ రెడ్డి పై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి.

Update: 2021-05-23 08:46 GMT

మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరింత ట్రబుల్ లో పడ్డారు.తాజాగా ఆయన కుమారుడు నితిన్ రెడ్డి పై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. మేడ్చల్ జిల్లా వాసి సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. దీనితో తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ సీఎస్ సోమేశ్ కూమార్ ను ఆదేశించారు. ఏసీబీ విజిలెన్స్, రెవెన్యూ శాఖలు సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈటెల నితిన్ రెడ్డి తన భూమిని కబ్జా చేసాడని.. తనకు న్యాయం చేయాలని ని మేడ్చల్ జిల్లా రావాల్ కోల్ కి చెందిన పీట్ల మహేష్ ముదిరాజ్ అనే వ్యక్తి సీఎం కేసీఆర్ కి ఫిర్యాదు చేశాడు. తనకు అందిన ఫిర్యాదు పై స్పందించిన సీఎం కేసీఆర్ తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్ కుమార్ ని ఆదేశించారు.

Tags:    

Similar News