BRS: పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి స్వరం
పెండింగ్‌లో ఉన్న నాలుగు నియోజకవర్గాలు టికెట్ల కోసం పట్టుబడుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు;
బీఆర్‌ఎస్ పార్టీలో రోజు రోజుకు అసంతృప్తి స్వరం పెరుగుతోంది. సీఎం కేసీఆర్ నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను పెండింగ్‌లో పెట్టడంతో టికెట్ల కోసం పట్టుబడుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఏకంగా అధిష్టానానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. సునీతా లక్ష్మారెడ్డికి ఏ పదవి అయినా ఇచ్చుకోండి కానీ టికెట్ మాత్రం తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇక జనగామలో టికెట్ రగడ చల్లారలేదు.పల్లా రాజేశ్వర్‌రెడ్డికే టికెట్ అంటూ బీఆర్‌ఎస్ వర్గాలు ప్రచారం చేస్తుంటే.. సిట్టింగ్ సీటు తనదే అంటున్నారు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.
అటు మెదక్ సీటు తన కొడుకు రోహిత్‌కు ఇవ్వాలంటూ మైనంపల్లి హన్మంతరావు తనదైన శైలిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.నకిరేకల్లులోనూ అసంతృప్తి కొనసాగుతుంది. అయితే కేటీఆర్ విదేశీ పర్యటన నుంచి వచ్చాకే మిగతా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని బీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు పలువురు సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వొద్దంటూ..పార్టీలోని ఓ వర్గం నేతలు సమావేశాలు నిర్వహిస్తూ..సిట్టింగ్‌లను మార్చకపోతే ఓడిస్తామంటున్నారు సొంత పార్టీ నేతలు. స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరిని అభ్యర్థిగా ప్రకటించండపై కూడా అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. తాటికొండ రాజయ్యకు మద్దతుగా మంద కృష్ణమాదిగ గళం విప్పారు. రాజయ్యకు అన్యాయం చేశారన్న మందకృష్ణ.. కడియంకు గుణపాఠం చెపుతామని హెచ్చరించారు.