Lemon Price : మార్కెట్లో చుక్కలు చూపిస్తోన్న నిమ్మకాయ ధరలు..!
Lemon Price : మార్కెట్‌లో నిమ్మకాయల రేట్లు చూస్తే మతిపోవడం ఖాయం.. ప్రధాన నగరాలు, పట్టణాల్లో అయితే కిలో నిమ్మకాయల ధర రూ. 200 దాటేసింది.;
Lemon Rates : దేశంలో పెరిగిన ధరలతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు.. రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు షాక్ మీద షాకిస్తుంటే.. వంట నూనెలు, బస్సు చార్జీలు, కరెంట్ చార్జీలు ఇలా ఒక్కొక్కటి పెరుగుకుంటూ వెళ్తూ కుదురుకోకుండా చేస్తున్నాయి. ఇప్పుడా లిస్టులోకి చేరిపోయాయి నిమ్మకాయలు.
మార్కెట్‌లో నిమ్మకాయల రేట్లు చూస్తే మతిపోవడం ఖాయం.. ప్రధాన నగరాలు, పట్టణాల్లో అయితే కిలో నిమ్మకాయల ధర రూ. 200 దాటేసింది. ఇక విడివిడిగా అయితే ఒక్కో నిమ్మకాయ రూ. 10 వరకు పలుకుతుంది. గతేడాదితో పోలిస్తే ఈ రేటు నాలుగు రెట్లు పెరిగింది.
మార్చి చివరి నాటికే ధర ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ధరలు మరింత పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎండకాలం సహజంగానే నిమ్మకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. డీహైడ్రేషన్ రాకుండా సమ్మర్‌లో ఎక్కువగా లెమన్ జ్యూస్ తాగేందుకు జనాలు ఇష్టపడుతుంటారు.
ఇందులో విటమిన్సీ కూడా ఉంటుంది కాబాట్టి డిమాండ్ ఉండడం సహజమే... కానీ ఊహించని రేట్లు మార్కెట్లో ఉండడంతో సామాన్యులు వామ్మో అంటున్నారు. దీనితో పెద్ద మొత్తంలో నిమ్మకాయలను కొనుగోలు చేయలేకపోతున్నారు.