హైదరాబాద్ శివారులో మరోసారి చిరుత పులి చిక్కింది. గత రెండు, మూడు రోజులుగా ప్రజలను భయపెట్టిన చిరుత మేకకు ఆశపడి బోనులో చిక్కింది. హైదరాబాద్ శివారులోని ఇక్రిశాట్ లో రెండు మూడు రోజులుగా చిరుత సంచారం కలకలం రేపింది. దీంతో ఇక్రిశాట్ సిబ్బంది ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాలు, బోనును అటవీ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో ఎట్టకేలకు చిరుత చిక్కింది. దీంతో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు, సిబ్బంది, కూలీలు ఊపిరి పీల్చుకున్నారు. బోనులో బంధించిన చిరుతను అధికారులు హైదరాబాద్ జూపార్కుకు తరలించారు.