Minister Tummala : రైతుపండుగ నాటికి రుణమాఫీ పూర్తి : మంత్రి తుమ్మల

Update: 2024-11-28 06:30 GMT

సాంకేతిక కారణాలతో మూడు లక్షల మంది రైతులకు రుణమాఫీ సొమ్మ ఖాతాల్లో జమ కాలేదని, దానిని మహబూబ్ నగర్ లో నిర్వహించే రైతు పండుగ నాటికి క్లియర్ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఇవాళ రం గారెడ్డి జిల్లా షాద్ నగర్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. తెలంగాణ బియ్యానికి విదేశాల వారు కోరు కుంటున్నారని చెప్పారు. వ్యవసాయానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. 22 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని అన్నారు. సన్న రకాలకు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తున్నామని అన్నారు. రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్య మని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News