Telangana Lockdown :లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి.. సీఎం కేసీఆర్ ఆదేశాలు..!
రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లను, డీజీపీ, పోలీసు అధికారులను ఆదేశించారు.;
Telangana Lockdown : రాష్ట్ర రెవెన్యూ నష్టాన్ని లెక్క చేయకుండా లాక్ డౌన్ ను అమలు పరుస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లను, డీజీపీ, పోలీసు అధికారులను ఆదేశించారు. మరికొద్ది రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశించనున్న నేపథ్యంలో రైతుల వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న పరిస్థితుల్లో ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని మరో వారం పది రోజుల్లో వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఎంజీఎం దవాఖానను మదర్ చైల్డ్ హాస్పిటల్ (MCH) గా మారుస్తామని ప్రస్తుతం వున్న జైలును అక్కడి నుంచి తరలించి అక్కడ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారు.