Lockdown 1st Day : తెలంగాణలో మొదలైన లాక్ డౌన్..!

లాక్‌డౌన్‌ సడలింపులు ముగియడంతో ఈ ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అన్నీ దుకాణాలు మూతపడ్డాయి.;

Update: 2021-05-12 05:02 GMT

తెలంగాణ లాక్ డౌన్ మొదటిరోజు మొదలైంది. లాక్‌డౌన్‌ సడలింపులు ముగియడంతో ఈ ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అన్నీ దుకాణాలు మూతపడ్డాయి. అటు రోడ్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు నిర్మానుష్యంగా మారాయి. లాక్ డౌన్ టైం కూడా దగ్గర పడడంతో ప్రజలు కూడా ఇళ్ళకి చేరుకుంటున్నారు. అటు లాక్‌డౌన్‌ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. అత్యవసర సేవలకి మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ పరీక్షలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా కరోనా కట్టడికి గాను పదిరోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..! 

Tags:    

Similar News