Keesara Accident: కాపాడమని వేడుకున్న కనికరించలేదు.. ఫొటోల కోసం పోటీ, బాధితుడి మృతి

ఫోటోలు, వీడియోలు తీస్తూ కాలం గడిపిన స్థానికులు..;

Update: 2024-11-21 04:45 GMT

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. విపరీతంగా రక్తస్రావం అవుతుంది. ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆ వ్యక్తి వేడుకున్నా స్థానికులు బాధితుడికి సాయం చేయలేదు. తీవ్ర రక్తస్రావం అవుతుంది కాపాడండి అని బాధితుడు వేడుకుంటున్నా.. చిత్రాలు, వీడియోలు తీస్తూ కాలం గడిపారు. ఈ సంఘటన కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది.

కీసర సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్‌కు చెందిన వి.ఎలేందర్ (35) కీసర సమీపంలోని రాంపల్లి చౌరస్తాలో నివాసం ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం కీసరలో నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు స్కూటర్‌పై వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఎలేందర్ ఒక్కసారిగి బైక్‌ పై నుంచి రోడ్డుపై పడిపోయాడు. స్థానికులు గమనించి కేకలు వేయడంతో డ్రైవర్ లారీని రివర్స్ చేశాడు. దీంతో లారీ చక్రాలు ఎలేందర్ కాళ్లపై నుంచి వెళ్లాయి. ఈ క్రమంలో రెండు కాళ్లపై తీవ్ర రక్తస్రావం అవుతున్న ఎలేందర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించాలని అభ్యర్థించాడు. చుట్టుపక్కల జనం 108కి సమాచారం అందించగా.. బాధితుడికి సహాచం చేయాల్సి పోయి.. అందరూ ఫొటోలు, వీడియోలు తీస్తూ గడిపారు. వారందరిని చూసిన ఎలేందర్‌ నిస్సహాయ స్థితిలో వుండిపోయాడు. కొద్దిసేపటికి 108 వాహనం వచ్చి ఈసీఐఎల్ చౌరస్తాలోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే బాధితుడు ఎలేందర్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎలేందర్‌కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. లారీ డ్రైవర్ లక్ష్మణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News