హైదరాబాద్ లో కొన్ని రకాల దీపావరి క్రాకర్స్ కాల్చడంపై నిషేధం విధించారు. భారీ శబ్ధం వచ్చే టపాసులు కాల్చడంపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ నగర పోలీసులు నిర్ణయించారు. దీపావళి రోజున బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై అధిక ధ్వనిని పుట్టించే క్రాకర్లను పేల్చడాన్ని నిషేధిస్తూ హైదరాబాద్ నగర పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నగర వాసులు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే క్రాకర్లు కాల్చడానికి అనుమతించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన డెసిబెల్ నిబంధనలు అతిక్రమించరాదని హెచ్చరించారు. శబ్ధ కాలుష్య ఫిర్యాదుల కోసం100కు డయల్ చేయవచ్చని సూచించారు. ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.