TG : టెక్ సమస్యతో తగ్గిన ఎల్ఆర్ఎస్ రాబడి.. రూ.1472 కోట్ల ఆదాయం

Update: 2025-04-01 12:00 GMT

అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎస్ఆర్ ఎస్) పథకం ద్వారా ప్రభుత్వానికి రూ.1472 కోట్ల ఆదాయం సమకూరింది. ఎల్ఆర్ఎస్ పథకంపై ప్రభుత్వం భారీ అంచనాలు పెట్టుకుంది. దీని ద్వారా రూ.2000 వేల కోట్ల ఆదాయాన్ని సమీకరించాలని లక్ష్యంగా ఎంచుకుంది. ఎస్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వేలాది మంది తమ దరఖాస్తులను పరిష్కరించుకోలేకపోయారు. దీంతో 25 శాతం రాయితీ ప్రకటించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల పరిధిలో రూ.25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 5 లక్షలకు పైగా తిరస్కరించారు. మిగిలిన 20 లక్షల మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లింపు కోసం లేఖలు పంపారు. ఇందులో 4 లక్షల 45 వేల మంది దరఖాస్తుదారులు ప్రభుత్వానికి రూ.1472 కోట్లు చెల్లించారు. నగదు చెల్లించిన దరఖాస్తుదారుల్లోని 51 వేల మందికి ప్రొసీడింగ్స్ ఉత్తర్వులను అందజేశారు. సాంకేతిక సమస్యలతో పరిష్కారం కానివారికి మరో అవకాశం ఇవ్వాలని దరఖాస్తు దారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Tags:    

Similar News