Madhu Yashki : అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే జాతీయ పార్టీని తెరపైకి తెచ్చారు : మధుయాష్కి
Madhu Yashki : మునుగోడు బైఎలెక్షన్‌లో టీఆర్ఎస్‌ను మట్టి కరిపించాలని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి పిలుపునిచ్చారు;
Madhu Yashki : మునుగోడు బైఎలెక్షన్‌లో టీఆర్ఎస్‌ను మట్టి కరిపించాలని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కాపలాకుక్కలా ఉంటానన్న కేసీఆర్.. జాతీయ పార్టీ పెట్టడంలో అంతర్యామేంటని ప్రశ్నించారు. కుటుంబపాలన, రాజ్యాధికారం కోసమే.. కేసీఆర్ తాపత్రయపడుతున్నారని ఆరోపించారు.అవినీతిని కప్పిపుంచుకోవడానికి జాతీయ పార్టీని తెరపైకి తెచ్చారన్న మధుయాష్కి.. బీఆర్‌ఎస్ ఏమో గానీ కేసీఆర్‌కు వీఆర్‌ఎస్ తప్పదన్నారు. మునుగోడు ఫలితాలతో టీఆర్‌ఎస్‌ను బొందపెట్టాలని మధుయాష్కి అన్నారు.