మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు 6 నెలల జైలు శిక్ష
మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు 6 నెలల జైలు శిక్షతోపాటు పదివేల జరిమానా విధించింది.;
మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు 6 నెలల జైలు శిక్షతోపాటు పదివేల జరిమానా విధించింది. 2019 ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారంటూ బూర్గంపహాడ్ పీఎస్‌లో కేసు నమోదైంది. దీనిపై విచారించిన ప్రజాప్రతినిధుల కోర్టు ఎంపీకి ఆరు నెలల జైలు శిక్షతోపాటు 10 వేల రూపాయలు జరిమానా విధించింది. వెంటనే మాలోతు కవిత జరిమానా చెల్లించడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.