Mahesh Kumar Goud : త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ లోకి మళ్లీ చేరికలు.. మహేశ్ కుమార్ సంచలనం
కేటీఆర్, బీజేపీ వేర్వేరు కాదని, బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనన్నారు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ లోకి చేరికలు ఉంటాయని, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంతమంది వస్తారో చూడాలన్నారు. త్వరలోనే కాంగ్రెస్ లోకి మరింత మంది ఎమ్మెల్యేలు చేరుతారని.. స్పష్టత వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు సన్నిహితంగా ఉండే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు. కాంగ్రెస్ లో చేరేందుకు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూలో సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు