Hydra : హైడ్రా కూల్చివేతలతో నిద్ర పట్టడం లేదు.. మల్లారెడ్డి హాట్ కామెంట్
హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. తెలంగాణలో హైడ్రా వల్ల ఎవరూ ప్రశాంతంగా నిద్ర పోవడం లేదన్నారు. అందరిలాగే తనకూ హైడ్రా నుంచి నోటీసులు వచ్చాయని.. తన కాలేజీలు కాంగ్రెస్ హయాంలో కట్టినవేనని తెలిపారు. ఇళ్లను కూల్చి ప్రజలను రోడ్డు మీద పడేయడం అవసరమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ రాజకీయాలు అని.. ఒక్కో మంత్రి ఒక్కో గ్రూపును తయారు చేశారని విమర్శించారు.