Malla Reddy : డ్రమ్స్ వాయించిన మల్లారెడ్డి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఎక్కడుంటే అక్కడ హంగామా ఉంటుంది. కార్యక్రమం ఏదైనా ఫుల్ జోష్‌తో ఉంటారు మల్లారెడ్డి. గతంలో తన మనవరాలి పెళ్లిలో డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. ఆయన ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా మల్లారెడ్డికి సంబంధించిన మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మేడ్చల్ జిల్లా పోచారంలో బీఆర్ఎస్ లీడర్ సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫలహారం బండి ఊరేగింపులో ఆయన సందడి చేశారు. ఏకంగా డ్రమ్స్ వాయించి అక్కడున్నవారిలో ఉత్సాహం నింపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.