TG : ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి : మందకృష్ణ మాదిగ

Update: 2024-08-10 07:15 GMT

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయడంలో రాష్ట్రాలు ముందుకు రావాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కోరారు. వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని మోదీ నిర్దిష్టంగా హామీ ఇచ్చారని చెప్పారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. వెంటనే వర్గీకరణ అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాలని మోదీకి విజ్ఞప్తి చేశామని తెలిపారు. సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ప్రతి న్యాయవాదికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు దాటినా రిజర్వేషన్ల ఫలాలు చాలా కుటుంబాలకు అందలేదని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను దక్షిణాదిలో నలుగురు సీఎంలు వెంటనే స్వాగతించారని, బీహార్ వంటి రాష్ట్రాల్లో దళితులు, అతి దళితులుగా పేర్కొంటూ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.

Tags:    

Similar News

Telangana Municipal Polls :