BJP: బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు..
BJP: బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.;
BJP: బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. కూకట్‌పల్లి, శేరిలింగ్ంపల్లి, అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చేరారు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. కూకట్‌పల్లి NKNR గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సభలో.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులంతా..బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రసంగించిన బండి సంజయ్.. కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. బీజేపీ మీటింగ్‌లతో కేసీఆర్ భయపడుతున్నాడన్నారు. రాష్ట్రం మొత్తానికి కేసీఆర్ కలుషితం చేశాడన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ అమలు చేయలేదన్నారు. ప్రపంచదేశాలన్నీ భారతదేశాన్ని గౌరవిస్తున్నాయని.. కానీ కేసీఆర్, కేటీఆర్‌లు మాత్రం చైనాను పొగుడుతూ చులకన చేసి మాట్లాడుతున్నారన్నారు.