మూడేళ్ల చిన్నారికి ఉరివేసి ఆపై తాను ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న లోకా సాహితి రెడ్డి (27) కూతురు వీతన్య రెడ్డి(3)కి ఉరివేసి ఆపై తాను ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి భర్త వేణుగోపాల్ రెడ్డి ఎల్బీసీలో పనిచేస్తున్నారు. కరీంనగర్ జిల్లా వెదిర గ్రామానికి చెందిన సాహితీతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. అయితే గత కొంతకాలంగా సాహితీ మానసిక పరిస్థితి బాగాలేదని సమా చారం. సంఘటన సమాచారం అందుకున్న పెద్దపెల్లి పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.