ఎవరు ఎన్ని ప్రగల్భాలు పలికినా గ్రేటర్‌లో మళ్లీ మేయర్ పీఠం TRSదేనన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి KTR. మీట్‌ది ప్రెస్‌లో మాట్లాడిన ఆయన.. BJP తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అభివృద్ధిలో హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలబెట్టడం వల్లే టాప్-5 కంపెనీలు ఇక్కడికి క్యూకట్టాయన్నారు. పెట్టుబడుల అయస్కాతంలాంటి హైదరాబాద్‌ను.. భవిష్యత్‌లో మరింతగా ముందుకు తీసుకెళ్తామన్నారు. గ్రేటర్‌వాసులకు ఏ కష్టమొచ్చినా అండగా ఉన్నామని, హైదరాబాద్ వరదలకు అతలాకుతలం అయినా కేంద్రం రూపాయి సాయం కూడా చేయలేదని మండిపడ్డారు. గల్లీ పార్టీ కావాలో.. ఢిల్లీ పార్టీ కావాలో ప్రజలే తీర్పిస్తారన్నారు.