Health Camp : చింతపల్లిలో మెగా హెల్త్ క్యాంపు

Update: 2024-10-28 06:30 GMT

చింతపల్లి మండల కేంద్రంలోని వనస్థలిపురం ప్రసిద్ధ హాస్పిటల్ సారథ్యంలో.. మెగా హెల్త్ క్యాంపును ఆదివారం ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ను మెగా క్యాంప్ చైర్మన్లు చైతన్య రాజు ప్రదీప్ లు శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు వృద్ధులు, వికలాంగులు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగపర్చుకోవాలన్నారు. అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఈ మెగా క్యాంపు కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రసిద్ధి హాస్పిటల్ చైర్మన్ ను కోరారు.

Tags:    

Similar News