అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
MIM అధినేత, MP అసదుద్దీన్ ఓవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు;
MIM అధినేత, MP అసదుద్దీన్ ఓవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ విషయంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. ఇంకా ఎన్నికల సమయం రాలేదు, వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తాము ఎన్నిస్థానాల్లో పోటీ చేయాలనేది మరో పార్టీ నిర్ణయించదని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో పోటీచేయడమే అసలు స్ఫూర్తి అన్నారు.పోటీ ఇవ్వదగినన్ని చోట్ల బరిలోకి దిగుతామని అసదుద్దీన్ చెప్పారు.
ఇక ముస్లిం ఓటు బ్యాంకుపైనా అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయన్నారు. తెలంగాణలో ముస్లిం, మైనార్టీల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారన్నారు. దళిత బంధు తరహాలో పేద ముస్లింలకు సాయం అందించాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.
రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైల్ నిర్మాణంపైనా తనదైన శైలిలో అసదుద్దీన్ స్పందించారు.. ఓల్డ్ సిటీలో మెట్రో ఎందుకు పూర్తిచేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. 5 వేల కోట్లతో శంషాబాద్ మెట్రోకు టెండర్లు పిలిచిన వారు.. 500 కోట్లతో పూర్యే ఓల్డ్ సిటీ మెట్రోను ఎందుకు పట్టించుకోవడం లేదని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.