Minister Damodar : కల్తీ కల్లు బాధితులను పరామర్శించిన మంత్రి దామోదర

Update: 2025-07-10 12:30 GMT

గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ కూకట్పల్లి లో కల్తీ కల్లు తాగి 37 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.కాగా నిమ్స్ లో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. డాక్టర్లను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. 31 మంది నిమ్స్ లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అందరూ ప్రస్తుతం స్టేబుల్ గా ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటనపై సీరియస్ అయిన మంత్రి... విచారణ జరుగుతుందని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కాగా, కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 7 కి చేరింది. మరో బాధితురాలు నర్సమ్మ (54) ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది.

Tags:    

Similar News