ఒక్క ఇంచు భూమిని కూడా కబ్జా చేయలేదని క్లారిటీ ఇచ్చిన మంత్రి ఈటల
ఒక్క ఇంచు భూమిని కూడా కబ్జా చేయలేదని క్లారిటీ ఇచ్చారు మంత్రి ఈటల రాజేందర్. ఉద్దేశపూర్వకంగానే బురద జల్లే బదులు పిలిచి అడిగితే సంతోషించేవాడిని అని అన్నారు.;
ఒక్క ఇంచు భూమిని కూడా కబ్జా చేయలేదని క్లారిటీ ఇచ్చారు మంత్రి ఈటల రాజేందర్. ఉద్దేశపూర్వకంగానే బురద జల్లే బదులు పిలిచి అడిగితే సంతోషించేవాడిని అని అన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌ను కలిసేందుకు మూడు రోజుల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. తమ పత్రిక, ఛానెల్‌లో వరుస కథనాలు ప్రసారం చేయడం బాధ కలిగించాయన్నారు. ప్రభుత్వం వేసిన విచారణ కమిటీ రిపోర్ట్ వచ్చాక తన భవిష్యత్తు నిర్ణయంపై ఆలోచన చేస్తానని అన్నారు మంత్రి ఈటల.