Harish Rao : తెలంగాణ గ్రామాలకే ఉత్తమగ్రామ పంచాయితీ అవార్డులు : మంత్రి హరీష్
Harish Rao : బీజేపీ, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు మంత్రి హరీష్ రావు. దేశంలో ఉత్తమగ్రామ పంచాయితీలు 20 ప్రకటిస్తే.. అందులో 19 తెలంగాణ గ్రామాలకే అవార్డులు వచ్చాయన్నారు.;
Harish Rao : బీజేపీ, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు మంత్రి హరీష్ రావు. దేశంలో ఉత్తమగ్రామ పంచాయితీలు 20 ప్రకటిస్తే.. అందులో 19 తెలంగాణ గ్రామాలకే అవార్డులు వచ్చాయన్నారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు ఇదే నిదర్శనమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అవార్డులు రావడం లేదంటూ ప్రశ్నించారు. తెలంగాణ గ్రామాల్లోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్, నీళ్లు ఉండేవి కావన్నారు. 70 ఏళ్లలో కాని పనులను.... ఈ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు హరీష్. పెండింగ్ బిల్లులపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు.